75. ధర్మం ఒక్కటే
Gita Acharan Gita Acharan
65.9K subscribers
20 views
0

 Published On Premiered Mar 20, 2024

“పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.35). ఈ క్లిష్టమైన బోధన మన మనస్సులో స్పష్టత కంటే ఎక్కువ సందేహాలను సృష్టించే అవకాశం ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితికి సందర్భోచితమైనది. అర్జునుడిలో ఆ క్షణం వరకు యోధుల ధర్మమే ఉంది, తరువాతి క్షణంలో సన్యాసి కావాలని కోరుకుంటాడు. ఈ మార్పుకు అవకాశము లేదు కనుక శ్రీకృష్ణుడు ఈ పద్యంలో అదే విషయాన్ని సూచిస్తున్నారు.

ధర్మం ఒకటే అయినా మనం దాన్ని అనేక విధాలుగా చూస్తాము. ఐదుగురు అంధులు ఒకే ఏనుగును తమ స్పర్శ ద్వారా ఎలా విభిన్నంగా గ్రహించారో, ధర్మము గురించి పాక్షిక అవగాహన అలాగే ఉంటుంది. వారిలో ఒకరు దానిని దంతంగా గ్రహిస్తే, అది అతని వాస్తవికత లేదా స్వధర్మం. ఏనుగును దంతంగా భావించే వ్యక్తి, ఏనుగును కాలు లేదా తోకగా భావించిన వ్యక్తి యొక్క సుందరంగా వర్ణింపబడిన అభిప్రాయాన్ని స్వీకరించడానికి ప్రయత్నించకుండా తన మార్గాన్ని అనుసరించాలని ఈ శ్లోకం సూచిస్తుంది.

ఎవరి అభిప్రాయము సరైనది అనేది తదుపరి ప్రశ్న. ఏనుగు భాగాలను తడిమిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసిన అభిప్రాయము వాళ్ళ దృష్టిలో వాస్తవమే. అందుకే గుణరహితమైనా స్వధర్మాన్ని అనుసరించండి అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు, ఇతరుల ధర్మాలతో పోలికను ప్రోత్సహించలేదు.

ధర్మం అనేది మన ఇళ్లలోకి ప్రవేశించే విద్యుత్తును పోలి ఉంటుంది. అది దాన్ని ఉపయోగించే ఉపకరణాన్ని బట్టి విభిన్నంగా వ్యక్తమవుతుంది. ప్రతి పరికరం దాని స్వంత స్వభావాన్ని కలిగి ఉంటుంది; టీవీ అవ్వాలనే ఫ్యాన్ కనే కలలు నిజం కావు కదా!

అణచివేత మనల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదని శ్రీకృష్ణుడు అంతకు ముందుగానే సూచించారు (3.33). పరధర్మాన్ని స్వీకరించడం అనేది తన స్వధర్మాన్ని అణచివేయడం. అణచివేత విభజనకు దారితీస్తుంది; అంధులు, ఏనుగుల విషయంలో లాగా వాస్తవికత అనేది అన్ని వ్యక్తిగత అవగాహనల సారం.

Subscribe: https://bit.ly/2gLIhLJ

WEBSITE :- https://www.gitaacharan.org/

YOUTUBE :-    / gitaacharan  

FACEBOOK :   / gitaaacharan  

PODCAST :-   / gitaacharan   And https://anchor.fm/GitaAcharan

BLOG :- https://gitaacharan.blogspot.com/

show more

Share/Embed