శ్రీరామనవమి పండుగ ఉత్సవముల ఆహ్వానము
RRG J CHANNEL RRG J CHANNEL
790 subscribers
414 views
0

 Published On Apr 10, 2024

శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం
- మామిడిపాలెం కొండ రామగిరి పై శ్రీరామనవమి వేడుకలు.
- ఐదు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం.

ఒంగోలు::

చైత్ర శుద్ధ నవమి, ఏప్రిల్ 17వ తేది శ్రీరామనవమి పర్వదినమును పురస్కరించుకొని ఒంగోలు నగరం, మామిడిపాలెం కొండపై వేంచేసియున్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతా రామ దేవస్థాన సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు మొగిలి ఆనందరావు, మద్దులూరి శ్రీనివాసులు తెలిపారు.

చైత్రశుద్ధ పంచమి 13వ తేది శనివారం మొదలు చైత్రశుద్ధ నవమి వరకు ఐదురోజులపాటు పంచాహ్నిక దీక్ష తో విశేష పూజలు శ్రీసీతారాములవారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు... వంద సంవత్సరములకు పైగా చరిత్ర కలిగిన శ్రీసీతారామ స్మామి దేవాలయములో గతంలో ఏనుగు అంబారీలతో, అత్యంత భక్తి పూర్వకముగా జరిగిన కార్యక్రమములవలే కొండపై నుండి స్ధానిక కేక్శవ స్వామి పేట తాతా బిల్డింగుల వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణల మధ్య కలశ శోభాయాత్ర, నృత్య గ్రామోత్సవములు, శ్రీరామనామ సంకీర్తనలు పాడుచూ ఊరేగింపుతో డోలు, సన్నాయి మృదంగ వాయిద్యములతో నిర్వహిస్తున్నామని తెలిపారు.

13వ తేది శనివారం ఉదయం 8గం.లకు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి ఆధ్వర్యములో 108 కలశములతో స్థానిక కేశవస్వామి పేట ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయము నుండి అభిషేక జలము తీసుకొని మహిళలు శోభాయాత్రతో సీతారామపురం మామిడిపాలెం కొండపై శ్రీసీతారామ దేవాలయము చేరి శ్రీసీతారాములవారికి అభిషేకం నిర్వహించెదరని, అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, అఖండ స్థాపన, పంచాహ్నిక స్థాపన, అలంకారం, అర్చన, తీర్ధగోష్టి, ప్రసాద వినియోగం కలదని, సాయంత్రం 5గం.లకు కేశవస్వామి పేట నుండి శ్రీ సీతారామాలయం వరకు శ్రీ గోకుల కోలాట భజన మండలి వారిచే "కోలాట సంకీర్తనోత్సవం" అర్చన, పూజాది క్రతువులు జరుగును.

14వ తేది ఆదివారం ఉదయం విష్ణు సహస్రనామ, అష్టోత్తర శతనామ పూజలు, హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం 5గం.లకు "నాద సంకీర్తనోత్సం" పేరిట డోలు, సన్నాయి మేళతాళములతో కేశవస్వామి పేట నుండి ఊరేగింపు, తదుపరి అర్చన, పూజాది క్రతువులు జరుగును.

15వ తేది సోమవారం ఉదయం అర్చన పూజాది కార్యక్రమాలు, సాయంత్రం 5 గం.లకు రామనామ "సంకీర్తనోత్సం" గాంధీరోడ్డు, గీతామందిర భక్తబృందం వారిచే కేశవ స్వామిపేట నుండి నిర్వహించబడును తదుపరి తదుపరి అర్చన, పూజాది క్రతువులు జరుగును.

16వ తేది మంగళవారం ఉదయం అర్చన పూజాది కార్యక్రమాలు, సాయంత్రం 5 గం.లకు నరసరావు పేట వాస్థవ్యులు, భరతనాట్యం నృత్యశిక్షకులు డా. పోలూరి కృష్ణ వాసు శ్రీకాంత్ తమ నృత్య గమనంతో కేశవస్వామి పేట నుండి శ్రీ సీతారామ స్వామి దేవస్థానం వరకు "నృత్యగమన గ్రామోత్సవం" జరుగును. తదుపరి తదుపరి అర్చన, పూజాది క్రతువులు జరుగును.

17వ తేది బుధవారం ఉదయం 6గం.లకు గోపూజ తదుపరి స్వామివారికి విశేషపూజలు జరుగును, రాత్రి 7గం.లకు లోకకళ్యాణార్ధం పరాంకుశం రామనాధాచార్యులు మరియు శిష్య బృందం చే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగునని తెలిపారు. కావున ఒంగోలు, పరిసర ప్రాంత హిందూబంధువులు, భక్తులు, అందరూ పై కార్యక్రమములలో పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించి శ్రీసీతారాములవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు బుధవారం శ్రీసీతారామ స్వామి దేవస్థానంలో కరపత్ర ఆవిష్కరణ చేశారు.

RRG J CHANNEL
10 ఏప్రిల్ 2024

show more

Share/Embed